శ్రీ రామలింగేశ్వర స్వామి
పరమశివుని దివ్య రూపం, భక్తులకు శాంతిని, సకల శుభాలను ప్రసాదించే కరుణామయుడు.
ఓం నమః శివాయ | శ్రీ మాత్రే నమః
నాగెళ్ళముడుపులో కొలువై ఉన్న 251 సంవత్సరాల పురాతన, మహిమాన్విత భూప్రస్తార శ్రీచక్ర సన్నిధి.
251 సంవత్సరాల పవిత్ర వారసత్వం
దాదాపు 251 సంవత్సరాల క్రితం, శ్రీ కూనపులి వెంకట రమణయ్య గారిచే ఇక్కడ అత్యంత పవిత్రమైన భూప్రస్తార శ్రీచక్ర ప్రతిష్ఠ జరుపబడింది. అప్పటినుండి ఈ మహిమాన్విత సన్నిధి భక్తుల పాలిట కొంగు బంగారమై, కోరిన కోర్కెలు ఈడేర్చే కల్పవృక్షమై విరాజిల్లుతోంది.
వారి కుమారులు శ్రీ కూనపులి వేంకట కోటేశ్వరశర్మ గారిచే ఈ శ్రీచక్ర పూజలు, నిత్య నైవేద్య ధూప దీపారాధనలు నిర్విఘ్నంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగింపబడ్డాయి.
ప్రస్తుతం, శ్రీ శేషఫణి శర్మ గారి కుమారుడు శ్రీ కూనపులి ఉమామహేష్ శర్మ, మరియు శ్రీ రాజేశ్వరరావు శర్మ గారి కుమారుడు శ్రీ కూనపులి శ్యామలా దుర్గాప్రసాద్ (KSD ప్రసాద్) గార్లు ఎంతో బాధ్యతగా ఈ పుణ్యక్షేత్ర నిర్వహణను ముందుకు నడిపిస్తూ, ఆలయంలో జరిగే ప్రతి ఉత్సవానికి, నిత్య పూజలకు ప్రధాన బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు.

శ్రీ మత్ పర్వత వర్ధని అమ్మవారి సన్నిధి, నాగెళ్లముడుపు
దివ్య దర్శనం
స్వామి అమ్మవార్ల దివ్య దర్శనం
పరమశివుని దివ్య రూపం, భక్తులకు శాంతిని, సకల శుభాలను ప్రసాదించే కరుణామయుడు.
చతుర్భుజిగా దర్శనమిస్తూ, భూప్రస్తార శ్రీచక్ర బిందువాసినిగా ఉంటూ భక్తులు కోరిన కోర్కెలు ఈడేర్చి, సంతానార్థులకు సంతానము నొసగే సకల లోక జనని.
పెద్దగా చూడటానికి చిత్రంపై నొక్కండి
ఆలయ వేడుకలు
10 రోజుల పాటు జరిగే మహా ఉత్సవం. పౌర్ణమి నాడు శ్రీచక్రానికి నవావరణ పూజ, అమ్మవారికి అలంకారాలు మరియు ముగింపుగా రథోత్సవం జరుగుతాయి.
10 రోజుల వేడుక5 రోజుల పాటు జరిగే పరమశివుని మహా వేడుక. రుద్రాభిషేకాలు మరియు జాగారం అత్యంత భక్తితో ఘనంగా నిర్వహిస్తారు.
5 రోజుల వేడుకప్రతి పౌర్ణమికి భూప్రస్తార శ్రీచక్రానికి విశేష నవావరణ పూజ మరియు స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి.
నెలరోజుల పాటు శ్రీ రామలింగేశ్వర స్వామివారికి నిత్య అభిషేకాలు జరుగుతాయి, విశేషంగా కార్తీక పౌర్ణమి నాడు ఉత్సవాలు జరుపబడతాయి.
స్వామి అమ్మవార్ల సేవలు
పగలు ఏకాదశ రుద్రాభిషేకం మరియు రాత్రికి శ్రీ చక్రమునకు నవావరణ పూజ జరుపబడును.
ధర్మకర్తలు మరియు కమిటీ

ఆలయ అభివృద్ధి మరియు పర్యవేక్షణ

నిత్య పూజా మరియు ఉత్సవాల నిర్వహణ







ఆలయ అభివృద్ధికి సహకరించండి
డిజిటల్ పేమెంట్స్ (UPI / GPay / PhonePe)
శ్రీ మత్ పర్వత వర్ధని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, నాగెళ్లముడుపు-523371, తర్లుపాడు మండలం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
+91 9949844807